![]() |
![]() |
.webp)
జబర్దస్త్ లో ట్రాన్స్జెండర్ పింకీ గురించి అందరికీ తెలుసు. మొదట జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తూ చివరికి తనకు నచ్చిన అమ్మాయి రూపంలోకి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఇప్పుడు మూవీస్ లో కొన్ని షోస్ లో చేస్తోంది. అలాంటి పింకీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాలను చెప్పింది. " చిన్నప్పటి నుంచి మా అక్క డ్రెస్సులు వేసుకునేదాన్ని. తర్వాత అలా అమ్మాయిగా ఉండడమే నాకు కరెక్ట్ అనిపించింది. అప్పుడే అనుకున్నా నేను అమ్మాయిలా మారాలి సర్జరీ చేయించుకోవాలి అని. అలా మా నాన్న రిటైర్ అయ్యాక మా చెల్లి పెళ్లి చేసాక నేను కొంత డబ్బు దాచుకుని సర్జరీ చేయించుకున్న. నిజంగా ఆ టైంలో నేను ఎన్నో కష్టాలు పడ్డాను. కనీసం నన్ను చూసుకుని మంచినీళ్లు ఇచ్చేవాళ్ళు కూడా లేరు.
అలాంటి టైంలో దేవుడిలా నాగబాబు గారు నాకు ఎంతో సాయం చేశారు. నా హాస్పిటల్ బిల్స్ కట్టారు, రూమ్ రెంట్ కి, ఫుడ్ కి అన్నీ ఆయనే చూసుకునే వారు. నాకు కొంచెం ఆరోగ్యం బాగయ్యాక షోస్ చేయడం స్టార్ట్ చేసాను. ఎప్పుడైనా ఇలాంటి ట్రాన్స్ ఫార్మేషన్ సర్జరీస్ చేయించుకోవాలి అనుకునేవాళ్లు కచ్చితంగా 18 ఏళ్ళు నిండాకే చేయించుకోవాలి. లేకపోతే సమస్యలు వస్తాయి. నాకు శివుడు , అమ్మవారు అంటే ఇష్టం. ఐతే నేను అమ్మాయిగా మారిన విషయం ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా మా ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. నేను జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోను. టెన్త్ చదివేటప్పుడు ఊళ్ళో నా గురించి అన్న మాటలనే ఇంట్లో మా అన్నా కూడా అనేసరికి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నా...తర్వాత ట్రీట్మెంట్ తో బతికా. తర్వాత లవ్ ఫెయిల్యూర్ లో స్లీపింగ్ పిల్స్ మింగేసా...నా సర్జరీ టైములో ఆర్థరైటిస్ వచ్చినప్పుడు స్లీపింగ్ పిల్స్ మింగేసా. ఆ శివుడు నన్ను చావు నుంచి మూడు సార్లు కాపాడాడు అంటే నేను ఇంకా ఏదో చేయాలి అని నన్ను ఆ దేవుడు బతికించాడని నమ్ముతాను. నేను బ్రాండెడ్ వస్తువులే వాడాలని అనుకోను. డబ్బులుంటే అమ్మకి పంపిస్తా కొంత డబ్బుతో ఎక్కడ తక్కువకు ల్యాండ్ దొరుకుతుందో అది కొనేస్తాను.."అంటూ ఎన్నో విషయాలు చెప్పింది.
![]() |
![]() |